గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 20:30:51

'ఆడ‌ప‌డుచులు సంతోషంగా ఉండాల‌న్న‌దే సీఎం ఆకాంక్ష‌'

'ఆడ‌ప‌డుచులు సంతోషంగా ఉండాల‌న్న‌దే సీఎం ఆకాంక్ష‌'

వరంగల్ రూరల్ : తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మున్సిపల్ పరిధిలోని ఆడపడుచులకు ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో చల్లా ధర్మారెడ్డి శ‌నివారం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా చీరెలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇంటికి పెద్దన్నలా కేసిఆర్ ఇచ్చిన చీరెలను ఆడపడుచులు సంతోషంగా స్వీకరిస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కోటి మంది ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందచేస్తున్నదన్నారు. 110 రకాల డిజైన్లలో బ‌తుక‌మ్మ చీర‌ల త‌యారీ జరిగింద‌న్నారు. దీనివల్ల సుమారు 20 వేల మంది చేనేత కార్మికులకు పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వమే ప్రజలకు దుస్తులు అందించిన చరిత్ర ఎక్కడా లేదన్నారు.


logo