రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత నిమజ్జనం చేసేందుకు మధ్యమానేరు స్పిల్వే ముందున్న మానేరువాగుకు వెళ్లారు. కానీ, దారిలో ఒక్క విద్యుత్తు దీపం ఏర్పాటుచేయకపోవడంతో సెల్ఫోన్ టార్చ్ వెలుతురులో భయంగా ముందుకుసాగారు.
తీరా అక్కడికి చేరుకునే సమయంలో ఆ పక్కనే ఓ శవం కాలుతుండటం చూసి వణికిపోయారు. చిమ్మచీకట్లో కాలే కట్టెల వెలుతురు మధ్యనే బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ తీరుపై మహిళలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.