Bathukamma | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పాల్గొని ప్రసంగించారు. పూల పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ, గ్రామ, పట్టణ, ధనిక, బీద అనే తేడా లేకుండా చేసుకునే పండుగ అని, మన సంస్కృతికి అద్దం పట్టే పండుగ, చోళులకాలం నుంచి ఉన్నట్లుగా అభివర్ణించారు.
కంప్యూటర్ సైన్సు విభాగంలో రమ, ఇంగ్లీష్ విభాగంలో ఆర్.మేఘనారావు, స్టాటిస్టిక్స్ విభాగంలో జే. శ్రీనివాస్, కామర్స్ కాలేజీలో పి.అమరావేణి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగలను ఎంతో ఉత్సహంగా ఆట-పాటలతో, లయబద్దమైన నృత్యాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు వరలక్ష్మి, ఎస్.జ్యోతి, ఎన్.సవితాజ్యోత్స్న, మమత, బి.దీపాజ్యోతి, సౌజన్య, కట్ల రాజేందర్, ఎస్.నరసింహచారి, రమేష్, ఫణి, ప్రగతి, నీలిమా, సలోని పాల్గొన్నారు.