Bathukamma | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈనెల 21నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ ఉత్సవాలపై మంగళవారం బేగంపేటలోని హరితప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21న వరంగల్లోని వేయి స్తంభాల గుడివద్ద బతుకమ్మ వేడుక ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.