బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుక జరుపుకొన్నారు.
బతుకమ్మ పాటలతో తెలంగాణ భవన్ హోరెత్తింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, బీఆర్ఎస్ నాయకురాళ్లు ముక్తవరం సుశీలారెడ్డి, మన్నే కవితా రెడ్డి, సామల హేమ, పావని గౌడ్, రమాదేవి, సుమిత్ర ఆనంద్, సరోజ తదితరులు పాల్గొన్నారు.
-హైదరాబాద్