జగిత్యాల : వీర శైవ సమాజ ఆరాద్యుడు, మహనీయుడు బసవేశ్వరుడు(Basaveshwar) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్(Mla Sanjay Kumar) అన్నారు. ఆదివారం శ్రీ మహాత్మా బసవేశ్వర 890 జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్(BR Ambedkar )కు స్ఫూర్తి మహాత్మా బసవేశ్వరుడని అన్నారు.
జిల్లా లో బసవ కూడలి ప్రముఖ కూడలిగా మారబోతోందని వెల్లడించారు.మెడికల్ కాలేజీ(Medical college) కి నలువైపులా వెళ్లే రహదారుల అభివృద్ధిలో భాగంగా 11 కోట్ల తో నటరాజ్ చౌరస్తా, బసవ కూడలి నుంచి బీటీ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు.బసవ కూడలి వద్ద ఐ ల్యాండ్ ఏర్పాటు ద్వారా సుందరీకరణ పనులు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేశ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు ముదుగంటీ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ జంబార్తీ రాజ్ కుమార్, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్, కూతురు రాజేశ్,గుర్రం రాము, నాయకులు వల్లేపు మొగిలి, అడువాల లక్ష్మన్, చందా పృథ్వి పాల్గొన్నారు.