హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బాసరలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ. 190 కోట్లు మంజూరు చేస్తామని చెప్పినట్టు వెల్లడించారు. అంతకుముందు బాసర ఆలయ అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.