కోటగిరి, సెప్టెంబర్ 26: బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సభాపతిని మరోసారి గెలిపించుకుంటామని నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రజక, నాయీబ్రాహ్మణ, మేరు సంఘాల నాయకులు తీర్మానాలు చేశారు.
ఈ మేరకు తీర్మాన ప్రతులను పోచారం శ్రీనివాసరెడ్డికి మంగళవారం కోటగిరిలో అందజేశారు.