అధ్యక్షా.. జర గద్వాల వైపు చూడండి!
నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గురువారం ఏకంగా కాంగ్రెస్ కరపత్రాలను ఇంటింటికీ పంచారు.
- కాంగ్రెస్ కరపత్రాలతో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రచారం
- బండ్ల రాజకీయ వ్యభిచారి అంటూ ప్రత్యర్థుల విమర్శలు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గురువారం ఏకంగా కాంగ్రెస్ కరపత్రాలను ఇంటింటికీ పంచారు. పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్నది. కాగా స్పీకర్ మాత్రం గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నాడని అనర్హత పిటిషన్లు కొట్టేశారు.
అప్పటి వరకు డైలమాలో ఉన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నాయకుడి అవతారం ఎత్తి మున్సిపల్ ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్ కరపత్రాలు పట్టుకుని హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికైనా స్పీకర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని.. ప్రజలు భావిస్తున్నారు. ఏ పార్టీయో చెప్పకుండా రాజకీయ వ్యభిచారిగా మారారని, కాంగ్రెస్‌లో మరో వర్గం సరితాతిరుపతయ్య ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కుమ్మక్కైన డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డిపై పీసీసీ చీఫ్‌నకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

