తెలంగాణకు తలమానికంగా దేశంలో ఎకడా లేనివిధంగా, బ్రహ్మాండమైన సచివాలయాన్ని నిర్మించి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అలాంటి దేవాలయాన్ని కూలగొడతానని అంటున్న బండి సంజయ్ ఖబడ్దార్. బిడ్డా.. నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే చీరేసే రోజులొస్తయ్. అంబేద్కర్ అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రగతిభవన్‌ను పేల్చేయాలని ఇంకో పిచ్చోడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండు. టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతాంగం కోసం, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు కాబట్టే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.
– అరూరి రమేశ్, ఎమ్మెల్యే
దళిత వ్యతిరేకి బండి
దళితులంటే బండి సంజయ్‌కు చులకన. దళితబిడ్డలంటే బీజేపీకి ఇష్టం ఉండదు. రాజ్యాంగం ప్రకారం సాధించుకున్న తెలంగాణలో నూతన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టుకుంటే బండి సంజయ్‌కి కండ్ల మంట. దళితులకు అతను బద్ధ వ్యతిరేకి. సచివాలయాన్ని కూల్చివేస్తానన్న బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, ముకు నేలకు రాయాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ బండి సంజయ్, రేవంత్‌రెడ్డి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అడ్రస్ లేదు. కాబట్టే ఫ్రస్ట్రేషన్లో ఏంమాట్లాడుతున్నారో తెలియడం లేదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడే ఇరు పార్టీల అధ్యక్షులను వెంటనే ఎర్రగడ్డ దవాఖానలో జాయిన్ చేయాలి.
– సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే
ప్రజావసరాలు తెలిసిన నాయకుడు కేసీఆర్
ప్రజల అవసరాలు తెలిసి, వారికి ఏమి కావాలో అర్థం చేసుకొని, అడగక ముందే వాటిని అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. కాబట్టే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువుగా ఉన్నది. 2011లో కొల్లాపూర్ మున్సిపాలిటీలో దూరంగా ఉన్న గ్రామాలను కలిపారు. ఆ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆ రెండింటిని మున్సిపాలిటీ నుంచి విడదీస్తూ జీవో, బిల్లు పాస్ చేయించారు. నా నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలను ఇలానే డీమెర్జ్ చేశారు. ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్
ప్రజలు రుణపడి ఉంటారు
2011లో కొల్లపూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటుచేశారు. కొల్లాపూర్‌కి దూరంగా ఉన్న అనేక గ్రామాలను మున్సిపాలిటీలో కలపడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదురొన్నారు. ఆ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సభలో బిల్లు పెట్టి బోయలపల్లి, నర్సింహాపురం గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తీసేయడం చాలా సంతోషం. అందుకు సహకకరించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయా గ్రామాల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే