హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని, వాళ్లంతా వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు హోటల్లో రహస్య మీటింగ్ పెట్టుకోగా, నిన్న మరో 10 మంది ఓ ఫాంహౌజ్లో సమావేశమయ్యారని తె లిపారు. అందుకే ముందు సీఎం రేవంత్రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. కులగణన తప్పుల తడకగా ఉన్నదని ఆరోపించారు. రాజలింగమూర్తి హత్యపై విచారణ చేయకముందే ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.