Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్..
Bandi Sanjay | వరంగల్ : పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేసులో హనుమకొండలోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి అనిత రాపోలు ఎదుట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )ను పోలీసులు ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల లాయర్ల వాదనలు విన్న అనంతరం జడ్జి.. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. అనంతరం బండి సంజయ్‌ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు.
Bandi Sanjay | వరంగల్ : పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేసులో హనుమకొండలోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి అనిత రాపోలు ఎదుట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )ను పోలీసులు ప్రవేశపెట్టారు. ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం జడ్జి.. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ విధించారు. మరికాసేపట్లో బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉంది.
సంజయ్‌పై కమలాపూర్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 120 బీ, సెక్షన్ 420, 447, 505 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంజయ్‌ను ఏ1గా, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పోతబోయిన వర్షిత్ పేర్లను చేర్చారు. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

