Bandi Sanjay | చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే..!
Bandi Sanjay : లుకౌట్ నోటీసులతో హైదరాబాద్, కరీంనగర్‌లోని తన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో బండి సంజయ్ శనివారం భగీరథ్‌ను సరెండర్ చేశారు. న్యాయవాదుల ద్వారా పోలీసు విచారణకు తన బిడ్డను తానే పంపించానని బండి పేర్కొన్నారు.
Bandi Sanjay : పోక్సో కేసులో నిందితుడైన తన కుమారుడి బండి భగీరథ్ (Bandi Bhageerath)ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎట్టకేలకు పోలీసులకు అప్పగించారు. ముందస్తు బెయిల్‌ను కోర్టు నిరాకరించడం.. లుకౌట్ నోటీసులతో హైదరాబాద్, కరీంనగర్‌లోని తన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో ఆయన శనివారం భగీరథ్‌ను సరెండర్ చేశారు. న్యాయవాదుల ద్వారా పోలీసు విచారణకు తన బిడ్డను తానే పంపించానని బండి పేర్కొన్నారు. చట్టంపై గౌరవంతోనే తాను భగీరథ్‌ను పోలీసులకు అప్పగించానని ఎక్స్ పోస్ట్‌లో ఎంపీ తెలిపారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తన కుమారుడిని అప్పగించిన అనంతరం ఎంపీ బండి సంజయ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘సత్యమేవ జయతే. మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను.
నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే.
Satyameva Jayate
With utmost respect for the law and judiciary, today my son Bandi Bhageerath went before the Telangana Police through our advocates for investigation.
I have said this before too: whether it is my own son or a common citizen, everyone is equal before the law.…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 16, 2026
మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతడిని నేనే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. భగీరథ్ న్యాయవాదులను సంప్రదించి తన వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. ఆ ఆధారాలు చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నారు. అయితే.. ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం (మే 18) నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది’ అని సంజయ్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

