సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 18:32:20

హెడ్‌లైన్స్ కోసం 'బండి' డెడ్‌లైన్స్‌

హెడ్‌లైన్స్ కోసం 'బండి' డెడ్‌లైన్స్‌

హైద‌రాబాద్ : న‌్యూస్‌లో హెడ్‌లైన్స్ కోస‌మే ఎంపీ బండి సంజ‌య్ డెడ్‌లైన్లు విధిస్తార‌ని శాసనమండలి చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. బండి సంజయ్ హెడ్ లైన్స్ కోసం డెడ్ లైన్ విధిస్తారన్నారు. జనగామ ఇష్యూలో ఒక్కో  ఊరిలో ఒక్కో డెడ్ లైన్ పెట్టారన్నారు. చిన్న విషయాల‌ను బూతద్దంలో పెట్టి చూస్తున్నారన్నారు. దుబ్బాకలో అలానే చేసిన‌ట్లు తెలిపారు.

చిన్నచిన్న విషయాలకే ఆరాచకాలు అలజడులు చేయాలని చూస్తున్న‌ట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యునిగా సంజయ్ హుందాతనంగా మాట్లాడ‌టం నేర్చుకోవాలి. మంత్రి కేటీఆర్‌పై అకారణంగా విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తేరు కానీ ఇక్కడమాత్రం గొప్ప గొప్ప  మాటలు మాట్లాడుతారు. 

సీఎం కేసీఆర్‌ను తిడితేనే పెద్ద లీడర్ అవుతా అనుకుంటే పొరపాటు అన్నారు. బీజేపీ నేతలు అన్ని అంశాల్లో డెడ్ లైన్ విధిస్తున్నారు. జనగామ అంశాన్ని రాష్ట్ర స్థాయి సమస్యగా మార్చే యత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగు రీతిలో బ‌దులిస్తామ‌న్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో వుంది. అయితే జ‌రిగే అన్నీ ఘటనలకు ప్రభుత్వానికి సంబంధం ఉందా అని ప్ర‌శ్నించారు. బీజేపీ సీనియర్ నేతల్లో కూడా  సంజయ్ వ్యాఖ్యలపై అసంతృప్తి ఉందన్నారు. బూతు పురాణం అందుకుంటే పెద్దనేతగా ఎదుగలేర‌న్నారు.