‘బండి’కి రాచమర్యాదలు!
బాలికపై లైంగికంగా వేధించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ అధికార, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన మర్యాదకు ఎలాంటి భంగం కలుగనివ్వలేదు.
- కొడుకుపై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలు
- పోక్సో కేసు నమోదైనా అధికారిక సభలో సంజయ్‌కి పెద్దపీట
- ఆడపిల్లకు అన్యాయం జరిగితే ప్రధాని మోదీ స్పందించరా?
- మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు
- ప్రియమిత్రుడు సంజయ్ అని సంబోధన
- మోదీ సభతో బండి సంజయ్, రేవంత్ బంధం బట్టబయలు
హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ)/హనుమకొండ(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాలికపై లైంగికంగా వేధించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ అధికార, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన మర్యాదకు ఎలాంటి భంగం కలుగనివ్వలేదు. పైగా ఆయనకు రాచమర్యాదలే ద క్కాయి. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు నిందితుడికే వత్తాసు పలికేలా ఉన్నది. పోక్సో కేసు నమోదైన మరునాడే హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమాల్లో స్వయంగా దేశ ప్రధాని మోదీ పా ల్గొన్న అధికారిక సభలో ఆయన పక్కనే బండి సంజయ్‌కి చోటుదక్కింది.
పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన పార్టీ బహిరంగ సభలోనూ మోదీ పక్కనే కుర్చీ పంచుకోవడాన్ని చూసి ప్రజలు, పార్టీ నేతలు విస్తుపోతున్నారు. కొడుకుపై తీవ్ర ఆరోపణలున్నా బండి సంజయ్‌కు రాచమర్యాదలు కల్పించడమేంటని ప్రశ్నిస్తు న్నారు. రాష్ట్ర పర్యటనకు మోదీ వచ్చిన నేపథ్యంలో సంజయ్‌కి చీవాట్లు తప్పవని, ఆయనపై చర్యలుంటాయనే చర్చ జరిగింది. కానీ కేసు గురించి మోదీ కనీసం స్పందించకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేనా ‘భేటీ బచావో’ నినా దం.. కేంద్ర మంత్రి కొడుకు ఇంత నీచానికి పాల్పడితే సదరు మంత్రిపై కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడుతు న్నారు. మోదీకి ఆడపిల్లల భద్రత, మానప్రాణాల కంటే పార్టీ, రాజకీయం, నాయకులే ము ఖ్యమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
బండికి రేవంత్ వత్తాసు
లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్ సర్కార్ నిందితుడికే వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నది. పోక్సో కేసులో వేగంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి నిందితుడి తండ్రి అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం మోదీ అధికారిక ఆప్యాయంగా, గౌరవంగా ‘నా ప్రియమిత్రుడు’ అని సంబోధించడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువత నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా బాధిత కుటుంబం నెల క్రితమే ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా వారిని బెదిరించి విషయం బయటికి రాకుండా చేసినట్టు విమర్శలున్నాయి. ఎక్కడ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా ‘హనీ ట్రాప్’ పేరుతో భయపెట్టాలని అన్ని స్టేషన్లకు ఉన్నతాధికారుల ద్వారా సర్కార్ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు.
వాయిదా డీల్!
మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసే వరకు పోక్సో కేసులో భగీరథ్‌పై చర్యలు తీసుకోకుండా బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి డీల్ కుదిరినట్టు తెలిసింది. అందుకే అరెస్టులో జాప్యం చేయడంతో నిందితుడికి, రాష్ట్ర ప్రభు త్వం తరఫున ఉన్నత స్థాయిలో భరోసా ఉన్న ట్టు స్పష్టమవుతున్నది. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో గట్టి సంబంధాలు ఉన్నా అనివార్య పరిస్థితుల్లో ఆయన కుమారుడిని వారికి ఇష్టం వచ్చిన సమయంలోనే అరెస్టు చేసేలా ప్రభుత్వపరంగా హామీ ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం, నిందితుడి తండ్రి మధ్య కుదిరిన అంగీకారం మేరకు నిందితుడికి ఇష్టమైనప్పుడు బండి సాయి భగీరథ్‌ను అరెస్టు చేసే సమయం ఇచ్చినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

