వరంగల్‌చౌరస్తా, మే 13 : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ఐదు రోజులుగా నిందితుడిని అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్, మే 13: పోక్సో కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్‌పై చర్యలు తీసుకోవాలని మహిళాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఐఎఫ్టీయూ, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ ప్రతినిధులు స్టేషన్‌ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కనిపించడం లేదంటూ బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కనిపించిన పోస్టర్లు. ఇలాంటి పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా వెలిశాయి. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వాలని ఆ పోస్టర్లలో ఉన్నది.
