Bandi Bhageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ వాపస్.. హైకోర్టుకు న్యాయవాది లేఖ
Bandi Bhageerath | పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను బండి సాయిభగీరథ్ ఉపసంహరించుకొన్నారు.
Bandi Bhageerath | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను బండి సాయిభగీరథ్ ఉపసంహరించుకొన్నారు. పోక్సో కేసులో ఇప్పటికే నిందితుడు అరెస్టు అయిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని పేరొంటూ ఆయన తరఫు న్యాయవాది ఎన్ నవీన్‌కుమార్ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాశారు. భగీరథ్ అరెస్ట్ అయినందున ముం దస్తు బెయిల్ పిటిషన్లో ఏవిధమైన ఉత్తర్వులను జారీచేయాల్సిన అవసరం లేనందున పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ టీ మాధవీదేవి గురువారం విచారించే కేసుల జాబితాలో ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణ క్యాటగిరీలో నమోదైంది.
లైంగిక వేధింపుల అభియోగాలతో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ వేసిన పిటిషన్‌పై ఈ నెల 21న శుక్రవారం అర్ధరాత్రి వరకు జస్టిస్ టీ మాధవీదేవి విచారించి తీర్పును ఈనెల 21కి వాయిదా వేశారు. తీర్పు వెలువరించే వరకు పిటిషనర్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా తా తాలిక రక్ష ణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది వినతిని న్యాయమూర్తి తిరసరించారు. బాధిత బాలిక వాంగ్మూలంలోని ఆరోపణల తీవ్రత దృష్ట్యా అరెస్ట్ నుంచి తక్షణ రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోమని తేల్చిచెప్పారు. ఈ పరిణామాల తర్వాత గత శనివారం బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. నిందితుడు అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమని న్యాయవాది లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులను జారీ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

