పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని, ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని కరీంనగర్లో పోస్టర్లు వెలిశాయి. పోక్సో కేసులో 13న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చినా భగీరథ్ గైర్హాజరు కావడంతో బస్‌స్టేషన్, తెలంగాణచౌక్, ఎస్సారార్ కళాశాల సహా పలు ప్రాంతాల్లో ఇలా పోస్టర్లు అంటించారు. బీజేపీ నాయకులు వాటిని చింపివేయగా అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో గురువారం ధర్నా నిర్వహించారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు డిమాండ్ చేశారు.

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పంజాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, శ్రీనివాస్‌నాయుడు, మేఘన, అహ్మద్ వాహి, మధుకర్‌యాదవ్ తదితరులు
బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని అఖిలభారత ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి పోక్సో కేసు నిందితుడిపై చర్యలు తీసుకొనే విషయంలో రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఈ సమావేశంలో మల్లు లక్ష్మి, విమలక్క, తదితరులు పాల్గొన్నారు.