వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలపై పోలీసులు నిషేధం విధించారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ ఉత్తర్వులు జారీచేశారు. నగరంలో శాంతి భద్రతలు, ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశంతో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.