మహబూబాబాద్ రూరల్, జూలై 8 : తెలంగాణలో రైతులకు సరిపడా యూరియా లేదని కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్ అంగీకరించారు. సోమ్లాతండాలో మంత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని యూరియా పరిస్థితిని వివరించినట్టు పేర్కొన్నారు.