ర్మూర్టౌన్,ఫిబ్రవరి19: క్యాతనపల్లిలో అధికార మదం తో కాంగ్రెస్ నేతలు సాగించిన దౌర్జన్యాలను అడ్డకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఖండించారు.
బాల్క సుమన్ అరెస్టు కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో దాడులతో పీఠాన్ని కైవసం చేసుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.