హైదరాబాద్: ప్రజా సమ్యస్యల మీద పోరాడే పోరాట ఫార్ములే కేటీఆర్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. రైతులపై సర్కారు దుర్మార్గాలను నిలదీసే ఫార్ములే కేటీఆర్ అని చెప్పారు. ఆశా కార్యకర్తలైన, ఆడబిడ్డల మీద, గురుకుల పసిబిడ్డల ఫుడ్ పాయిజనింగ్ మీద స్పందించి సర్కార్ మెడలు వంచే ఫార్ములే కేటీఆర్ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడులను ప్రశ్నించే ఫార్ములే కేటీఆర్, ఏడాదికాలంగా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న మూర్ఖపు సీఎం ఆగడాలను,అన్యాయాలను నిలదీస్తున్న నాయకుడే మన కేటీఆర్ అని చెప్పారు.
ప్రభుత్వానికి మింగుడుపడని, కొరకరాని కొయ్యగా మారి, ప్రజలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కేటీఆర్‌పై సర్కారు కుట్రలు, కుతంత్రాలకు కొదవలేదని విమర్శించారు. ప్రశ్నించడమే నేరమా, నిలదీయడమే పాపమా? అని ప్రశ్నించారు. లగచర్ల, దిలావర్పూర్పై, రైతుకు బేడీల మీద, విద్యార్థుల మరణాలపై, గురుకుల సంక్షోభాలపై నిలదీస్తున్నందుకే కేటీఆర్ కుట్రలా అంటూ నిలదీశారు.
కిషన్ రెడ్డిని కిస్మత్ రెడ్డి అంటు విమర్శించిన సీఎం రేవంత్.. స్వయంగా వెళ్లి ఆయనకు సన్మానం చేస్తాడని, కిషన్‌రెడ్డి చేయించుకుంటాడని విమర్శించారు. ప్రజలను అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పడతాయని, తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తాయన్నారు. మీ కుట్రలకు, కుతంత్రాలకు తమ నాయకుడు అదరడు, బెదరడని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాడని, మీ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలపై నిలదీస్తూనే ఉంటాడని స్పష్టం చేశారు.
ప్రజా సమ్యస్యల మీద పోరాడే పోరాట ఫార్ములే కేటీఆర్
రైతులపై సర్కారు దుర్మార్గాలను నిలదీసే ఫార్ములే కేటీఆర్
ఆశా కార్యకర్తలైన, ఆడబిడ్డల మీద – గురుకుల పసిబిడ్డల ఫుడ్ పాయిజనింగ్ మీద స్పందించి సర్కార్ మెడలు వంచే ఫార్ములే కేటీఆర్
తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడులను ప్రశ్నించే… pic.twitter.com/ChGDc7pE5H
— Balka Suman (@balkasumantrs) December 13, 2024