Balka Suman | ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. గతంలో పార్టీ పెట్టిన ఆల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, విజయశాంతి, షర్మిల పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. కొత్త పార్టీ పెట్టిన కవిత ప్రతిపక్షాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ను ప్రశ్నించాలి కానీ.. ప్రతిపక్షాన్ని తిట్టడమేంటని మండిపడ్డారు. దీన్ని బట్టే ఆమె ఎవరికోసం పార్టీ పెట్టారో అర్థమవుతుందని చెప్పారు.
కేసీఆర్ను మరమనిషి అని కవిత అనడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. సంక్షేమం అందించిన వ్యక్తి మరమనిషి అవుతారా అని నిలదీశారు. 70 లక్షల రైతులకు రూ.73వేల కోట్ల రైతుబంధు ఇచ్చినందుకు కేసీఆర్ మర మనిషా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎగ్గొట్టిన రేవంత్ హృదయం ఉన్న మనిషా అని మండిపడ్డారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేసిన కేసీఆర్ను విమర్శించే అర్హత కవితకు లేదని స్పష్టం చేశారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.