బొడ్రాయిబజార్/సూర్యాపేట రూరల్, జూలై 10 : సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన ఉధృతం చేశారు. తమను వేధిస్తు న్న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దాదాపు 200 మందికిపైగా విద్యార్థినులు బుధవారం సాయంత్రం కాలేజీ నుంచి సూ ర్యాపేట కలెక్టరేట్ వరకు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నిరసన తెలిపారు. రాత్రి పది గంటల వరకూ అక్కడే బైఠాయించారు. ప్రిన్సిపాల్ శైలజ తమపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, మెనూ పాటించడం లేద ని, ప్రశ్నిస్తే చేయిచేసుకుంటున్నారని, టీసీ ఇ చ్చి ఇంటికి పంపిస్తానని బెదిరిస్తున్నారని విద్యార్థినులు వారం నుంచి ఆందోళన చేస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో కలెక్టర్ విచారణ కమిటీ వేశారు. నాలుగు రోజులైనా చర్యలు లేకపోవడంతో విద్యార్థినులు బుధవా రం సాయంత్రం కాలేజీ హాస్టల్ నుం చి కలెక్టరేట్‌కు నడిచివచ్చారు. ఆ సమయం లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కళాశాలకు చేరుకొని అక్కడ ఉన్న కొందరు విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నా రు. కలెక్టరేట్‌కు బస్సు పంపి తిరిగి రావాలని కోరగా, విద్యార్థినులు ససేమిరా అనడంతో కలెక్టరేట్ సమావేశ మందిరానికి వచ్చి వారిని పిలిచి మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి, విద్యార్థినులను ప్రైవేట్ బస్సులో హాస్టల్‌కు పంపించారు.