ఆరోగ్యం క్షీణించడంతో స్పందించిన ఉద్యమకారులు
ముషీరాబాద్, జూలై 12: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం దవాఖానకు తరలించారు. కదలలేని స్థితికి చేరుకోవడంతో కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్ సహా పలువురు తెలంగాణ ఉద్యకారులు, నిరుద్యోగులు అంబులెన్స్‌ను రప్పించి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. మొదట నల్లకుం ట ఆంధ్ర మహిళాసభ, అక్కడి నుంచి నిమ్స్ దవాఖానకు తరలించారు. గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని తన నివాసంలో బక్క జడ్సన్ వారం రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా రు. శుక్రవారం జడ్సన్‌ను పరామర్శించడానికి వచ్చిన వేర్ హౌసింగ్ కార్పొరేషర్ మాజీ చైర్మన్ రజినీ సాయిచంద్, పలువురు ఉద్యమకారులు ఆయన పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే దవాఖానకు తరలించారు.
ఇంత దారుణమా?: రజినీ సాయిచంద్
ప్రజాపాలనలో ఇంత దారుణమా, ప్రభు త్వం బేషజాలకు పోయి జడ్సన్ దీక్షను నిర్ల క్ష్యం చేసిందని రజినీ సాయిచంద్ మండిపడ్డా రు. ఒకవైపు జడ్సన్ తనను దవాఖానకు తీసుకుపోవద్దని వారిస్తున్నా.. రజినీ సాయిచంద్ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తరలించేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా అపార్టుమెంటు బయట ఉన్న పోలీసుల ఎదు ట ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు.
నిమ్స్ దవాఖాన వద్ద ఉద్రిక్తం
బక్క జడ్సన్‌ను చేర్చుకునేందుకు నిమ్స్ వైద్యులు తొలుత నిరాకరించారు. బెడ్లు ఖాళీ లేవని, చేర్చుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. ఈ దశలో ని రుద్యోగులు, అభిమానులు, కుటుంబసభ్యు లు ఆందోళనకు దిగారు. వారి ఒత్తిడి మేరకు ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. సుమారు 30 నిమిషాలకు పైగా జడ్సన్‌ను అంబులెన్స్‌లోనే ఉంచడంతో దవాఖాన బయట తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అనంతరం వైద్యులు చేర్చుకోవడంతో ఆందోళనను విరమించారు. అంతకు ముందు వేర్వేరు దవాఖానలకు తరలించగా, బెడ్స్ లేవని జడ్సన్‌ను చేర్చుకోలేదు. ప్రస్తుతం జడ్సన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు దవాఖాన ఆర్ఎంవో తెలిపారు.