Bakka Judson | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తున్న బక్క జడ్సన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బక్క జడ్సన్ మాట్లాడుతూ.. తాను పార్టీ నుంచి కేవలం సస్పెండ్ మాత్రమే అయ్యాను. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడినే. కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను అరెస్టు చేయడం ఏంటో అర్థం కావడం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయి ఇంకా మమ్మల్ని శత్రువులను చూసినట్టు చూస్తున్నాడని జడ్సన్ మండిపడ్డారు. రైతుబంధు డబ్బులు రూ. 7 వేల కోట్లు ఎవరి అకౌంట్లోకి డైవర్ట్ అయ్యాయో రాహుల్ గాంధీని కలిసి అడుగుతానని తెలిపారు. తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో కూడా అడుగుతానని బక్క జడ్సన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ హౌస్ అరెస్ట్
రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తున్న బక్క జడ్సన్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
మా ప్రభుత్వంలో కూడా నన్ను అరెస్ట్ చేయడం ఏంటో.. టీడీపీ నుండి వచ్చిన ముఖ్యమంత్రి ఇంకా మమ్మల్ని శత్రువులను చూసినట్టు చూస్తున్నాడు.
రాహుల్… pic.twitter.com/UnnYiXNOgX
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2024