ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించండి
నల్లగొండ జిల్లా మల్కాపూర్ నుంచి రామాపురం క్రాస్‌రోడ్డు వరకు ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విజ్ఞప్తిచేశారు.
- మల్కాపూర్ నుంచి రామాపురం క్రాస్‌రోడ్స్ వరకు పనులు చేపట్టండి
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వినతి
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మల్కాపూర్ నుంచి రామాపురం క్రాస్‌రోడ్డు వరకు ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విజ్ఞప్తిచేశారు. పోచంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. హైవే విస్తరణకు అవసరమైన భూమి అందుబాటులో ఉన్నదని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. రెండు తెలుగు రాష్ర్టాల రాజధానులను కలిపే నేషనల్ హైవే-65.. మలాపూర్ నుంచి రామాపురం వరకు 150 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు.
ఎన్‌హెచ్-65 ఏర్పాటై 11 ఏం డ్లయినా, ఈ రోడ్డు వెంబడి గ్రామాలకు సర్వీస్ రోడ్లు, డ్రైనేజీలు, అండర్‌పాస్‌లు మంజూరు కాలేదని, ఫలితం గాప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదాలు జరిగే చౌటుప్పల్, గుండ్రాంపల్లి, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, టేకుమట్ల, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ ఎక్స్‌రోడ్ జంక్షన్, రామాపురం ఎక్స్ రోడ్ జంక్షన్ ప్రాం తాలను పోలీసులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారని వెల్లడించారు. సూర్యాపేటలోని పలు జంక్షన్లలో అండర్ పాస్‌లు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభించలేదని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని విజ్ఞప్తిచేశారు. ఎన్‌హెచ్- 167 లోని సీతారామపురం, చిలుకూరు, ముకుందాపురం, నేరేడుచర్ల, అప్పన్నపేట రహదారులను నాలుగు లేన్లుగా మంజూరు చేయాలని గడ్కరీని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

