హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చవద్దని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ హితవు పలికారు. రేవంత్‌రెడ్డికి సీఎం హోదా తెలియడం లేదని, అందుకే అడ్డగోలుగా మాటలు తూలుతున్నారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని పెంచి పోషించిందే కాంగ్రెస్ అని, కేసీఆర్ మిషన్‌భగీరథ ద్వారా ఫ్లోరైడ్హ్రిత జిల్లాగా మార్చారని వివరించారు.
తెలంగాణభవన్‌లో శనివారం బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నేతలు కిశోర్‌గౌడ్, శ్రీధర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పుట్టిన రోజున దీవెనలను పొందాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడటంపై తెలంగాణ భగ్గుమంటున్నదని పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ చెప్పారు. అహంకారంతో వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ హెచ్చరించారు.