Sridhar Babu | హైదరాబాద్, డిసెంబర్12 (నమస్తే తెలంగాణ): హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, దానిని సరిచేసుకోవాల్సి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. హైడ్రా రాగానే కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో పనిచేశారని, దానివల్ల తమకు, ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చిందని, ఆ విధంగా జరగకూడదని పేర్కొన్నారు.
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకూదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అధికారులు అలా ఎలా చేస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, కొందరు చేస్తారంటూ మంత్రి జవాబిచ్చారు. మంత్రి దుద్దిళ్ల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.