హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌కు భారతరత్న ఇవ్వాలని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మధుసూదనాచారితో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో హాజరై ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్పవ్యక్తి జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. రక్షణ మంత్రిగా పాకిస్థాన్ కబంధ హస్తాల నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేయడంలో కీలకభూమిక పోషించారని ప్రశంసించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ జాతి నేత కాదని, జాతీయ నేత అని అభివర్ణించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తుంగ బాలు, కిశోర్‌గౌడ్, కురువ విజయ్, చిరుమల్ల రాకేశ్ పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి, బడుగు బలహీనవర్గాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మం త్రులు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.