Ayyappa Padi Pooja | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించనున్న ఈ మహా పడిపూజకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు.మంచి సంకేతం ఇవ్వాలని అయ్యప్ప పూజ చేస్తున్నామని.. ఈ పూజకు అందర్నీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం నిరూపితమైందని తెలిపారు. 50 శాతం పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని అన్నారు. పాలన గాలికొదిలేసి ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై దృష్టి పెడితే ప్రజలు ఇలాంటి తీర్పునే ఇస్తారని వ్యాఖ్యానించారు.
ఈ నెల 17న బుధవారం సాయంత్రం 6.30 గంటలకు
తెలంగాణ భవన్ లో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహిస్తున్నాం.ఇదే ఆహ్వానంగా భావించి
మాలలో ఉన్న స్వాములందరూ పెద్ద ఎత్తున విచ్చేసి
విజయవంతం చేయాలని కోరుతున్నాం.– బీఆర్ఎస్ నాయకులు @talasani_sai pic.twitter.com/p7JHYsIX1A
— BRS Party (@BRSparty) December 15, 2025
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అద్భుత విజయాలు వచ్చాయని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు. రెండు విడతల్లో సగం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ అధికార పార్టీని ప్రజలు ఓడించారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఓట్లు వస్తే కాంగ్రెస్ గెలిచినట్లుగా ప్రకటించారని మండిపడ్డారు. ఓటు చోరీ జరిగిందని ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని.. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మోరీల్లో బ్యాలెట్ పేపర్లు దొరుకుతున్నాయని అన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతోందని చిరుమళ్ల రాకేశ్ విమర్శించారు. తెలంగాణలో వ్యక్తిగత కక్షలు ఉండవని.. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఏవిధంగా నడుస్తున్నాయో తెలంగాణకు అదే సంప్రదాయం తీసుకొచ్చారని మండిపడ్డారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.