హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నది.
ఈ సందర్భంగా ప్రముఖ కవి అయాచితం నటేశ్వరశర్మకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కవి, గాయకులైన ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరవుతారని పేర్కొన్నది.