17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు
డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ వీసీ వీఎస్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. 17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేశారు. 43 మంది విద్యార్థులకు బంగారు పతకాలు (డిగ్రీలో 17, పీజీలో 26) అందజేశారు.
- 43 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ప్రదానం
- ఘనంగా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్నాతకోత్సవం
హైదరాబాద్ సిటిబ్యూరో / చర్లపల్లి, డిసెంబర్ 28: డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ వీసీ వీఎస్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. 17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేశారు. 43 మంది విద్యార్థులకు బంగారు పతకాలు (డిగ్రీలో 17, పీజీలో 26) అందజేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ మాట్లాడుతూ.. 76 ఏండ్ల వయసు నిండిన వారు డిగ్రీలు పొందడం చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. డ్రైవర్, ఖైదీ, గృహిణి ఇలాంటి వారు డిగ్రీలు పొందడం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు.
యూనివర్సిటీ వీసీ సీతారామారావు మాట్లాడుతూ.. డిగ్రీలో 20,972 మంది, పీజీలో 10,757 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, వీరందరికీ పట్టాలు ప్రదానం చేశామని తెలిపారు. కాగా, చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న 17 మంది జీవిత ఖైదీలు బీఏ, పీజీలో సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టాలు అందుకొన్నట్టు జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ రాయ్ తెలిపారు. అనంతరం డిగ్రీ పట్టాలు పొందిన ఖైదీ విద్యార్థులను అభినందించారు. సాత్నకోత్సవంలో పాలకమండలి సభ్యులు ఓయూ వీసీ రవీందర్ యాదవ్, ఆర్ శైలేశ్ రెడ్డి, డాక్టర్ బానోత్లాల్, రిజిస్ట్రార్ ఏవీఎన్ రెడ్డి, ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, సుధారాణి, ప్రుష్పా చక్రపాణి, వడ్డానం శ్రీనివాస్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్, జైలర్ గొట్టే రామకృష్ణ, వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
76 ఏండ్ల వయసులో పీహెచ్డీ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ 76 ఏండ్ల వయసులో పీహెచ్డీ సాధించారు. గురువారం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయనకు పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు. నేటితరంలో చాలామంది కనీసం పీజీ కూడా పూర్తి చేయడం లేదని, అలాంటివారికి తాను మార్గదర్శిగా నిలువాలనే పీహెచ్డీ చేశానని ఇస్మాయిల్ తెలిపారు. తాను 2018లో హిందీలో పీహెచ్డీ ప్రారంభించానని చెప్పారు. 1984లోనే హిందీలో పీజీ, ఎంఫిల్ పూర్తి చేసినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

