అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 20 : హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆటోవాలాలు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి తమ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నందుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 100 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇకపై ఎవరూ అలాంటి పనులు చేయొద్దని భరోసానిచ్చారు. మీ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ హామీ ఇచ్చారు.