మాగనూరు, జూలై 5 : కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆటోడ్రైవర్లు మాట్లాడుతూ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయినట్టు వాపోయారు.
ఏడాదికి రూ.12 వేలు భృతి అందించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.