హిమాయత్‌నగర్, జనవరి 2: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం అసెంబ్లీని ముట్టడించనున్నట్టు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ల జేఏసీ నేతలు ప్రకటించారు.
శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బీ వెంకటేశం, నేతలు వేముల మారయ్య(బీఆర్టీయూ), ఏంఏ సలీం(తెలంగాణ జాగృతి), ఈ ప్రవీణ్(టీయూసీఐ), ఏ.సత్తిరెడ్డి(టీఏడీఎస్), పీ యాదగిరి(టీఎన్టీయూసీ), శివానందం(టీఏఎండీయూ), ఎండీ బాబా (సీఐటీయూ) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.