ఆటో డ్రైవర్ల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం జిల్లా కేంద్రాల్లో ఆటోలతో భారీ ర్యాలీలు నిర్వహించారు.
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు
- మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో మా బతుకులు రోడ్డున పడ్డాయ్
- మా కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు వినతి పత్రాల అందజేత
జనగామ చౌరస్తా/మెదక్అర్బన్/దుబ్బాక టౌన్, డిసెంబర్ 23: రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం జిల్లా కేంద్రాల్లో ఆటోలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. జనగామ రైల్వేస్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోలతో ర్యాలీ చేపట్టారు. మెదక్లోని వెల్కమ్ బోర్డు నుంచి ఆటోనగర్, పాతబస్టాండ్, రాం దాస్ చౌరస్తా, న్యూబస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేప ట్టారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు ఉపాధి క ల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. చోట్ల ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడా రు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు, ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్స్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రవాణా రంగ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీలేని రుణం ఇప్పించాలని, పిల్లలకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని కోరారు. రూ.10 లక్షల ఉచిత ప్రమా ద బీమా సౌకర్యం కల్పించాలని, ఉచిత వాహన బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. 150 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవడానికి రూ.ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

