హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ.. ఆటో డ్రైవర్లు భారీ నిరసనకు సిద్ధమయ్యారు. మహాలక్ష్మీ పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11గంటలకు ఆందోళన చేపట్టినట్టు ఆటో డ్రైవర్లు తెలిపారు.