ఆగిన మరో ఆటోడ్రైవర్ ఊపిరి
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగించిన ఆయన ఏడాదికాలంగా సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.
- గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు
- అప్పుల భారంతో మనోవేదన
- 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం
- గుండెపోటుతో మాణిక్యం మృతి
పెగడపల్లి, ఫిబ్రవరి 7: ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగించిన ఆయన ఏడాదికాలంగా సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అప్పుల భారంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ బొమ్మెన మాణిక్యం(45) 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగిస్తున్నాడు. ఏడాదికాలంగా ఆటో సరిగా నడువక పోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఇంటిపై తీసుకున్న అప్పులు కూడా భారం కావడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి మృతి చెందాడు. మాణిక్యానికి భార్య జమున, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మాణిక్యం కుటుంబాన్ని ఆదుకోవాలని పెగడపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు భోగ భూమయ్య, గౌరవాధ్యక్షుడు బొమ్మెన స్వామి, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొమ్మెన స్వామి, ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

