రామగిరి, అక్టోబర్ 31: గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో శుక్రవా రం చోటుచేసుకున్నది. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న నక్క శంకర్ (47) బ్యాంక్ రుణంతో సొంతంగా ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశాడు. గిరాకీ సరిగా లేకపోవడం, దీనికి తోడు అనారోగ్య సమస్యలతో మదనపడ్డాడు. శుక్రవా రం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు దవాఖానకు తరలిస్త్తుండగా మార్గమధ్యలో మరణించాడు.
వరదలో గల్లంతై యువకుడు మృతి
అక్కన్నపేట, అక్టోబర్ 31: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ (25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. పుల్లూరి రామకృష్ణ తన బైక్‌పై బుధవారం రాత్రి మల్లంపల్లి నుంచి హుస్నాబాద్‌కు బయలుదేరాడు. ఊరి చివరిలోని లోలెవల్ బ్రిడ్జి దాటుతుండగా వరద ఉధృతిలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. కుటుంబీకులు తమ కుమారుడు హుస్నాబాద్‌లోని అత్తగారింటికి వెళ్లాడని అనుకున్నారు. గురువారం ఉదయం ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి కుమారుడి ఆచూకీ కోసం తెలిసిన వారి ఇండ్లలో వెతికారు. శుక్రవారం పొలాల మధ్య ఇసుక మేటల్లో కూరుకుపోయిన మృతదేహాన్ని రైతులు గుర్తించారు.
దొంగతనం నెపంతో మహిళ ఆత్మహత్య
తుంగతుర్తి, అక్టోబరు 31: దొంగతనం నెపం మోపడంతోపాటు పోలీసుల వేధింపులకు మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతురాలి భర్త రమణ బోయిన సోమయ్య తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రమణబోయిన మల్లయ్య తన ఇంట్లో సోమ నరసమ్మ(50) బంగారం దొంగతనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను పీఎస్‌కు పిలిపించి దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర
మనస్థాపానికి గురైన నర్సమ్మ గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య
చౌటకూర్, అక్టోబరు 31: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం పెద్దరాజు గిరిజన తండాకు చెందిన బానోత్ మహేందర్ (20) సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ (ఏఐఎంఎల్) మూడో ఏడాది చదువుతున్నాడు. శుక్రవారం వసతి గృహం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.