వీణవంక, అక్టోబర్ 28: కుటుంబ పోషణ భారమై.. తీవ్ర మనోవేదనకు లోనైన ఆటోడ్రైవర్ గుండెపోటు తో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు కు చెందిన ఎదులాపురం వెంకటేశ్వ ర్లు (43) సుమారు 25 ఏండ్లుగా మోటర్ ఫీల్డ్ పై ఆధారపడి జీవిస్తున్నా డు. 12 ఏం డ్ల క్రితం ఆ టో తీసుకొని చల్లూరు నుంచి కరీంగనర్కు నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం క ల్పించడంతో అతడి ఉపాధిపై దెబ్బపడింది. సోమవారం కరీంనగర్లో సామగ్రి తీసుకురావడానికి కిరాయికి వెళ్లాడు. గంజ్ మార్కెట్లో సామగ్రిని ఆటోలో వేస్తుండగానే గుండెపోటుతో వెంకటేశ్వర్లు ఒక్కసారిగా కు ప్పకూలాడు. గమనించిన చుట్టు ప క్కల వారు కుటుంబ సభ్యులకు స మాచారం ఇచ్చి.. దగ్గర్లోని దవాఖానకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. బాధి త కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు, ఆటో యూనియన్ సభ్యులు కోరుతున్నారు.