ఉపాధి కరువై ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఉపాధి కరువై.. కుటుంబం గడవక.. మరోవైపు అప్పులు భారమై జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శనివారం చోటుచేసుకున్నది.
- రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఘటన
ముస్తాబాద్, ఏప్రిల్ 4 : ఉపాధి కరువై.. కుటుంబం గడవక.. మరోవైపు అప్పులు భారమై జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శనివారం చోటుచేసుకున్నది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన మారెల్లి శ్రీనివాస్ (52) కొన్నేండ్లుగా ముస్తాబాద్ నుంచి దుబ్బాక, గంభీరావుపేట, సిరిసిల్లలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత ఇల్లు లేకపోవడం తో స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. అప్పటికే కొంత అప్పు ఉండగా, రెం డేండ్ల కిందట కూతు రు వివాహం చేయడంతో మొత్తం రూ.5 లక్షల వరకు అప్పు అయ్యింది. రెండేండ్లుగా ఆటో నడవకపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం మదనపడుతుండేవాడు. దీంతో శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

