సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 1: ఓవైపు గిరాకీ లేకపోవడం, మరో వైపు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జి ల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. మంచిర్యాలలోని ఏసీసీ సుభాష్‌నగర్‌కు చెందిన గోనె సాయికుమార్ (33) కొంతకాలంగా సీసీసీ నస్పూర్ నాగార్జున కాలనీలోని నివాసముంటున్నాడు.
భార్య పద్మకు జ్వరం రావడంతో ఈ నెల 30న మంచిర్యాలలోని ఓ దవాఖానకు తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చాడు. మరుసటిరోజు దవాఖానకు వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో సాయికుమార్ బావమరిది మల్లేశ్ 31న రాత్రి ఆయన ఇం టికి వెళ్లి పిలిచాడు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని సా యికుమార్ విగత జీవిగా వేలాడుతూ క న్పించాడు. పోలీసులు శనివారం ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుగుణాకర్ తెలిపారు.