బోనకల్లు, డిసెంబర్ 6: ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో శుక్రవారం అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్లు మండలం ఆళ్లపాడుకు చెందిన మరీదు అంజయ్య(55) కొ న్నేళ్ల క్రితం బోనకల్లు వచ్చి ఆటో నడుపుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం తెచ్చిన అప్పులు తీరకపోవడంతో ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఇంటిని తా కట్టు పెట్టి రూ.8 లక్ష లు లోను గా తీసుకున్నాడు. ఫ్రీ బస్సు ప థకంతో ప్రయాణికులు ఆటోలు ఎక్కే పరిస్థితి లేకపోవడం వల్ల కుటుంబ పోషణ బరువై ఇబ్బంది పడుతున్నా డు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అం జయ్య గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డిమందు తాగాడు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు.
కౌలు రైతు ఆత్మహత్య ; పంటలు పండక అప్పుల పాలు
గార్ల, డిసెంబర్ 6: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెంలో కౌ లు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన భూక్యా భద్రూ(41) పుట్టుకతో మూగ, చెవిటివాడు. నాలుగేళ్లుగా రెం డెకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మిర్చి, పత్తి పంట వేయగా, సరిగా పండక అప్పుల పాలయ్యా డు. రూ. మూడు లక్షలు అప్పు కాగా, వాటి ని ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఈ నెల 5న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏ రియా దవాఖాన కు తరలించారు. మెరుగైన వైద్య కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.