బజార్హత్నూర్, మార్చి 6 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం రాంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ భగత్ సంతోష్(36) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం సంతోష్ కుటుంబ పోషణ కోసం రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు.
ఆటో సరిగా నడవకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. గురువారం ఇంటి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంతోష్ భార్య రోజా ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు.