మెహిదీపట్నం, మార్చి 8: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటోడ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివసించే వినయ్‌కుమార్(35) ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం 90శాతం కాలిన గాయాలతో వినయ్‌కుమార్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.