EAPCET | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎప్‌సెట్‌కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు తొలగించారు. ఎప్‌సెట్‌లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వుచేస్తూ జీవో జారీ చేశారు.
ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యింది. తొలిరోజు మొత్తం 5,010 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 3,116 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 1,891 మంది, రెండు పరీక్షలకు హాజరయ్యేందుకు ముగ్గురు చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని వెల్లడించారు.