Tungabhadra | అయిజ, డిసెంబర్ 27 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఆర్డీఎస్ పరిధిలో యాసంగి పంటలకు నీటి లభ్యత తగ్గడంతో 2024-25 ఏడాదికి ఆర్డీఎస్కు 5.896 టీఎంసీల నీటి వాటా కేటాయించారు.
తెలంగాణ జలవనరుల శాఖ టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్కు ఇండెంట్ పెట్టారు. దీంతో ప్రాజెక్టు స్లూయీస్ నుంచి నీరు విడుదల చేశారు. రోజూ 1500 క్యూసెక్కుల మేర 10 రోజులు 1.078 టీఎంసీలు విడుదల చేయనున్నారు. శనివారం నాటికి ఆనకట్టకు నీరు చేరే అవకాశం ఉన్నదని ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు.