Aulugu | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గాదిగూడ అడవుల్లో అడవి అలుగు ప్రత్యక్షమైంది. స్థానికంగా ఉన్న రైతులు తమ పంట పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఓ అడవి అలుగు అటువైపుగా వచ్చి.. రైతులు ఏర్పాటు చేసిన కంచెలో చిక్కుకుంది. ఈ క్రమంలో ఓ ముగ్గురు వ్యక్తులు అడవి అలుగును బంధించి.. రూ. 5 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని అడవి అలుగును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.