గంగాధర, అక్టోబర్ 27 : ఏడాదిగా విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్‌పాషా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఏడాది క్రితం తల్లిదండ్రులు ఆరోపించగా.. ఉపాధ్యాయులు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. శుక్రవారం పాఠశాలలో సభ నిర్వహించగా, అటెండర్ వేధింపుల విషయం వెలుగులోకి రావడంతో అధికారులు కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళాశిశు సంక్షేమ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్, విద్య, పోలీస్‌శాఖల అధికారులు విచారణ చేపట్టారు. యాకూబ్‌పాషాను అరెస్ట్‌చేసి గంగాధర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీసీపీవో పర్వీన్, ఎంఈవో ప్రభాకర్‌రావును వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యుడిపై చర్యలు చూసుకుంటామని వెల్లడించారు.